ఈమధ్య ట్రెండ్ మారింది. హీరోల కంటే విలన్లకు ఎక్కువ గిరాకీ పెరిగింది. అందుకే హీరోలు సైతం ప్రతినాయకులుగా కనిపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. జై లవకుశలో ఎన్టీఆర్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్‌కి ఫాలో అవుతూ మరో అగ్ర కథానాయకుడు కూడా విలనిజం చూపించబోతున్నట్టు టాక్. వెంకటేష్ - క్రిష్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. సురేష్ బాబు నిర్మించే ఈ చిత్రం థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుందని టాక్. ఈ సినిమాలో వెంకీ రెండు పాత్రల్లో కనిపిస్తాడని, ఓ పాత్ర లో విలన్ లక్షణాలు కనిపిస్తాయని టాక్. విలన్ పాత్ర కోసం వెంకీ తన గెటప్, సెటప్ పూర్తిగా ఛేంజ్ చేయబోతున్నాడట. వెంకీ నటిస్తున్న గురు ఈ వేసవికి విడుదల కాబోతోంది. ఆ వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆ తరవాతే క్రిష్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.