సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశం తరువాత తమిళనాడులో వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ రజినీకాంత్ నిన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి DMK మాజీ రథసారధి అయిన కరుణానిధిని కలిసాడు.
దీనితో ఒక్కసారిగా తమిళనాట రాజకీయం వేడెక్కింది. రజినీకాంత్ భవిష్యత్తులో DMKకి మద్దతు తెలుపుతాడు అన్న సంకేతాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఉన్న రాజకీయాలు తమిళనాడు ప్రతిష్టని దెబ్బ తీసాయి అని ఆయన చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఇలా ఏంటి అన్నది కూడా అంతుపట్టకుండా ఉంది.
అయితే రజినీకాంత్ కేవలం మర్యాదపూర్వకంగానే కలవడం జరిగింది అని అంతకుమించి మరేమీ జరగలేదు అని రజిని సన్నిహితులు చెబుతున్నారు. ఇక DMK వర్గాలు మాత్రం తమ అజెండా కి వ్యతిరేకంగా గనుక రజినీకాంత్ పార్టీ అజెండా ఉంటే తమ ప్రతిఘటన తప్పక ఉంటుంది అని చెబుతున్నారు.
మొత్తానికి ఈ భేటి తీవ్ర స్థాయి చర్చకి దారి తీసింది.