భరత్ అనే నేను చిత్రం పైన పోలీసు కేసు!

మరిన్ని వార్తలు

ఈమధ్యకాలంలో సినిమాల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఆయా చిత్రాల పైన కేసులు వేస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఇటువంటి సంఘటనే సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రానికి ఎదురైంది.

ఇంతకి విషయం ఏంటంటే- నవోదయం పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు గుంటూరు జిల్లా ఎస్పీ ని కలిసి తమ పార్టీ పేరుని తమకి తెలియకుండా వాడుకోవడమే కాకుండా ఆ పార్టీని చిత్రంలో పలు సన్నివేశాల్లో కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ ఫిర్యాదు చేశారు.

తమ నుండి అనుమతి పొందకుండా ఈ సినిమా లో తమ పార్టీ పేరుని ఉపయోగించుకోవడం, పరుష పదజాలం వాడడం వంటివి చేయడంతో సినిమా దర్శక-నిర్మాతలని అలాగే హీరో పైన కేసు నమోదు చేయమని కోరాడు.

మరి దీని పైన భరత్ అనే నేను చిత్రం టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS