సమంత- నాగ చైతన్య విడిపోయారు. దేశంలో రోజుకు వేలమంది విడిపోతుంటారు. అయితే సెలబ్రిటీలు కాబట్టి వారి జీవితాలపై ఆసక్తి వుంటుంది కాబట్టి మీడియా దాన్ని పెద్ద విశేషంగా చూపిస్తుంది. విశ్లేషణలు కూడా ఇస్తుంది. ఇప్పుడు చైతు సామ్ పై కూడా ఇలాంటి కధనాలే వినిపిస్తున్నాయి. అయితే ఇందులో అక్కినేని వారి విడాకుల దోషం అనే కధనం మాత్రం అందరూ కవర్ చేస్తున్నారు. దోషం ఏమిటంటే మొదటి పెళ్లి అక్కినేని వారికి కలసి రాలేదట. నాగార్జున, సుమంత్, సుప్రియ.. ఈ ముగ్గురి మొదటి పెళ్లి ముక్కలైయింది. ఇప్పుడు చైతు అదే బాట పట్టాడు. మొత్తం నలుగురికి మొదటి పెళ్లి కలసి రాలేదు. అంటే అక్కినేని వారికి విడాకుల దోషం ఉందా ? అనే కోణంలో కధనాలు వారుస్తున్నారు. నిజానికి ఇక్కడ అక్కినేని వారు ఇద్దరే. సుమంత్, సుప్రియాలది యార్లగడ్డ ఇంటిపేరు. కానీ అక్కినేని మనవడు, మనవరాలు కాబట్టి మీడియాలో అక్కినేని పేరే చలామణి అయిపోతుంది.
అదలా వుంచితే.. ఇప్పుడు అఖిల్ కోసం ఓ చర్చ నడుస్తుంది. అదేంటంటే అఖిల్ ఈ విడాకుల దోషం నుంచి బయటపడ్డాట. అదెలా అంటే ఐశ్వర్యరాయ్ పెళ్లిని అప్లేయ్ చేస్తున్నారు. ఐశ్వర్య జాతకంలో ఎదో దోషం వుండి మొదటి ఆమెకు అరటి చెట్టుతో వివాహం చేశారని బాలీవుడ్ మీడియాలో కధనాలు వచ్చాయి. అప్పట్లో ఈ కధనాలు హాట్ టాపిక్ గా మారాయి. ఐశ్వర్య లాజిక్ చూసుకుంటే అఖిల్ కు విడాకుల దోషం తప్పినట్లేనట. అఖిల్ కు మొదట శ్రేయా భోపాల్ తో ఎన్గేజ్మెంట్ అయ్యింది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. సో .. మొదటిది తప్పిపోయింది కాబట్టి .. ఇంక అఖిల్ అక్కినేని వారి విడాకుల దోషం నుంచి బయటపడినట్లేనని చెప్పుకుంటున్నారు. ఈ లాజిక్ కొంచెం తేడాగానే వుంది. అఖిల్ కి జరిగింది నిశ్చితార్ధమా ? పెళ్ళా ? ఏంటో.. ఈ విడాకుల టాపిక్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో..