సమంతపై ఇటీవల ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సమంత అరుదైన చర్మ సమస్యతో బాధపడుతోందని, త్వరలోనే ఆమెకు అమెరికాలో సర్జరీ జరగబోతోందని ఆ వార్తల సారాంశం. దీనిపై సమంత ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే.. సమంత మేనేజర్ మాత్రం ఓ క్లారిటీ ఇచ్చారు. సమంత పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారని ఆయన ధృవీకరించారు. అయితే అమెరికా ప్రయాణం విషయంలో ఆయన ఏ మాటా చెప్పలేదు. సో.. సమంత అమెరికా వెళ్లడం మాత్రం ఖాయమే. అయితే ఎందుకు, ఏమిటి? అనేది సస్పెన్స్.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత గత నెల రోజుల నుంచీ.. సోషల్ మీడియాలో కనిపించడం లేదు. సినిమా వేడుకల్లోనూ పాల్గొనడం లేదు. షూటింగులకు సైతం ఆమె హాజరు కావడం లేదు. ఈనెలలోనే `ఖుషి` షూటింగ్ జరగాల్సివుంది. అయితే సమంత రాకపోవడంతో ఈ షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే సమంతకు సర్జరీ అంటూ ప్రచారం మొదలైంది. దీనిపై సమంత ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో ఈ రూమర్లకు బలం వచ్చినట్టైంది. సమంత మేనేజర్ పెదవి విప్పినా - అమెరికా ప్రయాణం విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.