బాహుబలి రికార్డు బద్దలు కొట్టిన RX 100

మరిన్ని వార్తలు

RX 100 చిత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది, అదే సమయంలో కలెక్షన్స్ పరంగా కూడా ఇది పెద్ద పెద్ద చిత్రాల రికార్డులని తిరగారాస్తున్నది.

ఇక విషయానికి వస్తే, హైదరాబాద్ లోని దేవి 70MM (ఆర్టీసీ క్రాస్ రోడ్స్) లో ఈ చిత్రం అన్ని షోలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నది. ఈ చిత్రం మొదటివారం పూర్తయ్యేసరికి రూ 29, 32, 867/- (గ్రాస్) వసూలు చేయగా ఇప్పటివరకు ఈ ధియేటర్ చరిత్రలో ఇది ఒక రికార్డుగా చెబుతున్నారు.

ఇంతకముందు ఈ రికార్డు బాహుబలి చిత్రం (రూ 28,82, 370 గ్రాస్) పేరిట ఉండగా RX 100 ఈ కొత్త రికార్డు సృష్టించింది. ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రానికి ఇంతటి ప్రజాదరణ దొరుకుతుండడం నిజంగా విశేషమే అని చెప్పొచ్చు.

ఇక వేరే సెంటర్లలో కూడా RX 100 చిత్రానికి మంచి వసూళ్ళు నమోదవుతున్నాయి. ఇక ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎంత వసూలు చేయనుంది అన్న దాని పైన అందరి దృష్టి నెలకొని ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS