RX100 చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ దృష్టిని తనవైపుకి తిప్పుకోగలిగాడు దర్శకుడు అజయ్ భూపతి. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది, కథ విషయానికి వచ్చినా కూడా చాలా వైవిధ్యమైనదిగా ఉందంటూ ఆయన ప్రశంసలు కూడా తన ఖాతాలో వేసుకోగలిగాడు.
ఇక విషయానికి వస్తే, నిన్న రాత్రి హైదరాబాద్ లో పెద్దల సమక్షంలో లక్ష్మి శిరీష తో అజయ్ భూపతి వివాహం జరిగింది. ఈ వివాహానికి బంధువులు, ఇండస్ట్రీలో ఆయనకి సన్నిహితులు పలువురు విచ్చేసి అజయ్ కి శుభాకాంక్షలు తెలియచేశారు.
తొలి చిత్రంతోనే పెద్ద విజయం సాధించి ఇండస్ట్రీలో ఒక స్థిరమైన స్థానం సంపాదించుకున్న ఆనందంలో ఉండగానే ఆయనకి పెళ్ళి కూడా జరగడం అజయ్ కి డబల్కిక్ ఇచ్చే అంశం అని చెప్పొచ్చు.
ఇక ఈ ఆనంద సమయంలో ఈ కొత్త జంటకి మా www.iQlikmovies.com తరపున వివాహ శుభాకాంక్షలు.