RX100 మూడు రోజుల బంపర్ కలెక్షన్స్

మరిన్ని వార్తలు

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అదే కోవలోకి చేరిన సినిమా RX100.

ఈ సినిమాకి సంబందించిన టీజర్స్, ట్రైలర్ లు ప్రేక్షకుల్లో RX100 పైన మంచి హైప్ ని క్రియేట్ చేయగలిగాయి. ఇక విడుదలయ్యాక కూడా ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకొగలుగుతున్నది, దీనితో ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తున్నది.

మొదటి రోజు రూ 1 cr, రెండో రోజు 1.3 cr, మూడవ రోజు  రూ 1 cr వసూళ్ళు రాబట్టగలిగింది. ఈ చిత్రానికి  వెచ్చించిన బడ్జెట్ తో వస్తున్న కలెక్షన్స్ బేరీజు వేసి చూస్తే ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ లిస్టు లో చేర్చొచ్చు. ఇక ఈరోజు ఆదివారం అవ్వడంతో ఈ సినిమాకి ఇంకొక రెండు కోట్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొత్తానికి ఈ సంవత్సరం విడుదలైన బ్లాక్ బస్టర్స్ చిత్రాలలో RX100 చేరిపోయినట్టే...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS