కేరళ కోసం RX 100 బైక్

మరిన్ని వార్తలు

కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో ప్రపంచ నలుమూలల నుండి సహయం వస్తున్నది. మన తెలుగు హీరోలు సైతం తమవంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు.

అందులో భాగంగానే RX 100 సినీ హీరో అయిన కార్తికేయ కూడా తనవంతుగా కేరళ వరద బాధితుల కోసం అండగా నిలబడేందుకు ముందుకి వచ్చాడు. RX 100 చిత్రంలో తాను వాడిన RX 100 బైక్ ని వేలం వేయబోతున్నాడు.

అలా వేలం వేసాక వచ్చిన మొత్తాన్ని కేరళ వరద బాధితులకి అందివనున్నాడట. ఈ విషయమై సోషల్ మీడియా ద్వారా వేలంపాట గురించి వివరాలని హీరో అందరితో పంచుకున్నాడు.

ఇక ఈ వేలంపాటలో RX 100 బైక్ కేరళ వరద బాధితుల కోసం ఎంత సమకూర్చనుందో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS