క్యాన్సర్ తో ప్రముఖ నటి మృతి

By iQlikMovies - August 20, 2018 - 16:36 PM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ హిందీ నటి సుజాత కుమార్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న అర్దరాత్రి ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

 

వివరాల్లోకి వెళితే, ప్రముఖ నటి-రచయిత అయిన సుచిత్ర కృష్ణమూర్తి సోదరి అయిన సుజాత కుమార్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం అందించినప్పటికి క్యాన్సర్ బాగా పెరిగిపోవడంతో ఆమెని వైద్యులు బ్రతికించలేకపోయారు.

ఇక సుజాత కుమార్ శ్రీదేవి రీ-ఎంట్రీ చిత్రం అయిన ఇంగ్లీష్-వింగ్లీష్ ఆచిత్రంలో ఆమెకి అక్కగా నటించారు అలాగే తెలుగులో బాలకృష్ణకి నాయనమ్మగా లెజెండ్ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు.

సుజాత కుమార్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంలో www.iQlikmovies.com తరపున కూడా ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS