మామూలుగా ప్రీ లుక్.. ఫస్ట్ లుక్.. అని వింటుంటాం సినిమా ప్రమోషన్లకు సంబంధించి. పోస్టర్స్ ట్రెండ్ పాత బడిందని అనుకున్నారేమో.. కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. తొలి మీమ్ పోస్టర్.. అంటూ ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపము’ సినిమా టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ని పరిచయం చేసింది. ఇప్పుడంతా మీమ్స్ ట్రెండ్ నడుస్తున్న దరిమిలా, ఈ మీమ్స్ పోస్టర్.. సహజంగానే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తోంది. ఓ అమ్మాయి, అబ్బాయి.. అదొక లైబ్రరీ. అమ్మాయి బుద్ధిగా లైబ్రరీలో తనకు కావాల్సిన బుక్ గురించి వెతుకుతోంది. ఓ ఇంట్రెస్టింగ్ బుక్ చదవాలన్నది ఆమె ఆలోచన.
కానీ, ఓ తుంటరి కుర్రాడి ఆలోచనలు ఇంకోలా వున్నాయి. ‘ఈ నడుమేదో షానా ఇంట్రెస్టింగ్‌గా వుంది.. ఎట్టయినా ఈ రోజు తాకాలి..’ అంటాడు ఆ తుంటరి కుర్రోడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ట్యాక్సీవాలా’ సినిమాలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గుర్తుందా.? ఆ బ్యూటీనే ఈ సినిమాలో హీరోయిన్. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శ్రీధర్ గాదె ఈ చిత్రానికి దర్శకుడు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. మీమ్ పోస్టర్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. మరి, సినిమా ఎలా వుంటుందో.!