సాహో & భరత్ అను నేను కి నోటీసులు?

మరిన్ని వార్తలు

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకి కాపీరైట్ ఇబ్బందులు తరచుగా ఎదురవుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ- పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి. ఈ చిత్రం మూలకథ ఫ్రెంచ్ చిత్రం అయిన ‘లార్గో వించ్’ నుండి తీసుకున్నట్టు అందుకుగాను ఆ చిత్రం తాలుకా రీమేక్ రైట్స్ కలిగి ఉన్న T-సిరీస్ సంస్థకి అజ్ఞాతవాసి టీం ఫైన్ కూడా కట్టినట్టు వార్తలు చూశాము.

అయితే ఇప్పుడు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్న వార్తల ప్రకారం, ప్రభాస్ సాహో చిత్రం అలాగే మహేష్ భరత్ అను నేను చిత్రాలకి సంబంధించి కథలలో కొన్ని కీలక పాయింట్స్ ఈ సినిమా నుండే తీసుకున్నారట! దీనితో ఇప్పుడు కాపీరైట్స్ కలిగి ఉన్న T-సిరీస్ ఈ రెండు సినిమాల నిర్మాతలకి నోటీసులు పంపే అవకాశం ఉందని ఇప్పుడు నడుస్తున్న చర్చ సారాంశం.

మొత్తానికి ఇప్పుడు ఈ ఒక్క ఫ్రెంచ్ సినిమా నుండి తెలుగులోని మూడు భారీ చిత్రాలు తీస్తున్నారు అని తెలియడంతో ఇప్పుడు అందరు షాక్ కి గురవుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఉందా లేదా అని పక్కన పెడితే సదరు ఫ్రెంచ్ చిత్రానికి మాత్రం విపరీతమైన పబ్లిసిటీ వస్తున్నది.

చూద్దాం.. ఈ కాపీరైట్ అంశం ఎలా మారనుందో...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS