'సాహో' ప్ర‌మోష‌న్ కోసం.. 5 కోట్ల కారు!

By iQlikMovies - July 21, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

రూ.300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందించిన చిత్రం సాహో. అంత పెట్టుబ‌డి పెట్టిన‌ప్పుడు ప్ర‌మోష‌న్లు కూడా వైవిధ్యంగా ఉండాలి క‌దా? చిత్ర‌బృందం కూడా ఇప్పుడు అదే ప్లాన్ చేస్తోంది. సాహో ప్ర‌మోష‌న్ల కోసం ఓ ప్ర‌త్యేక‌మైన కారుని రంగంలోకి దింపుతోంది. దీని ఖ‌రీదు ఏకంగా 5 కోట్లు. సాహో లో ప్ర‌భాస్ వాడిన కారు ఇది. విదేశాల్లో ఈ కారుని ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. సాహో షూటింగ్ ఆస్ట్రియాలో జ‌రిగింది.

 

అక్క‌డే ఈ కారుని వాడారు. షూటింగ్ అయిపోయాక‌.. అక్క‌డి నుంచి హైద‌రాబాద్ తీసుకొచ్చారు. ఈ కారుని సాహో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో అభిమానుల కోసం ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచాల‌ని భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో వాడిన బైక్‌ల‌ను కూడా ప్ర‌మోష‌న్ల కోసం తీసుకురాబోతున్నార‌ని తెలుస్తోంది. సుజిత్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రం ఆగ‌స్టు 30న విడుద‌ల కాబోతోంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుద‌ల చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS