బాహుబలి తరవాత ప్రభాస్ నుంచి మరో సినిమా రాలేదు. ప్రభాస్ అభిమానుల దృష్టంతా సాహోపైనే ఉంది. కాకపోతే ఆగస్టు 15 వరకూ ఈ సినిమా వచ్చే ఛాన్స్ లేదు. కనీసం ఆగస్టు 15నైనా వస్తుందా? అనేది ఇప్పుడు అందరిలోనూ అనుమానం. ఈ సినిమా ప్రస్తుతం రీషూట్లు జరుపుకుంటోందని, అందుకే ఆసల్యం అవుతోందని ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వీటిపై చిత్రబృందం కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిందని, ఆగస్టు 15న తప్పకుండా విడుదల చేస్తామని అంటోంది. సాహోలో కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేయడం వాస్తవం. కాకపోతే వాటికి సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్‌కి కావల్సినంత సమయం చేతిలో ఉండాలని సాహో టీమ్ భావించింది. మే చివరి నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేస్తే, విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉంటుంది. కాబట్టి ఆగస్టు 15న విడుదలకు ఎలాంటి ఢోకా లేనట్టే.
ఈ రోజుల్లో రీషూట్లు సహజం. క్వాలిటీ కోసమో, లేదంటే బెటర్ అవుట్ పుట్ కోసమో తీసిన సన్నివేశానికి మెరుగులు దిద్దాల్సివస్తుంది. సాహో విషయంలోనూ అదే జరిగింది. ఎన్ని రీషూట్లు చేసుకున్నా అనుకున్న సమయానికి ఈ సినిమా రావడం ఖాయం. అంతకంటే ప్రభాస్ అభిమానులకు కావల్సింది ఏముంది?