'సాహో'రే ఫ్యాన్స్‌ని బుట్టలో పడేశారే'!

మరిన్ని వార్తలు

ఇదిగో అదిగో అంటూ ఊరించిన 'సాహో' టీజర్‌ వచ్చేసింది. ఊరించినందుకు ఫ్యాన్స్‌ని అస్సలు డిజప్పాయింట్‌ చేయలేదు రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌. 'బాధైనా, సంతోషమైనా పంచుకునేవాళ్లెవరూ లేరు..' అంటూ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ చెప్పే డైలాగుతో టీజర్‌ స్టార్ట్‌ అయ్యింది. 'నేనున్నాను..' అంటూ హీరో, హీరోయిన్‌ని హగ్‌ చేసుకోవడం.. ఆ తర్వాతి నుండి అసలు సిసలు యాక్షన్‌ మొదలైంది. యాక్షన్‌ ప్యాక్‌డ్‌ అన్నందుకు, అందుకు తగ్గట్లుగానే టీజర్‌ మొత్తాన్ని యాక్షన్‌తో నింపేశారు. భారీ భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌, నిజంగానే తెలుగు తెరపై ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా యాక్షన్‌ ఘట్టాలను చూపించారు. టీజర్‌లోనే ఇంత యాక్షన్‌ ఉంటే, ఇక సినిమాలో యాక్షన్‌కి ఫ్యాన్స్‌ పిచ్చెక్కిపోతారేమో. రకరకాల ప్యాటర్న్‌లో యాక్షన్‌ ఘట్టాలు వస్తూనే ఉన్నాయి టీజర్‌ నిండా. ఎవరెవరో కనిపించారు.

 

కానీ, హీరో, హీరోయిన్‌ తప్ప పెద్దగా పరిచయమున్న ముఖాలు కావవి. ఛేజింగ్‌ షాట్లు, హై అండ్‌ లొకేషన్లు.. మతులు పోగొట్టేశాయి ఈ ఒక నిమిషన్నర టీజర్‌లోనే. అంతు చిక్కని శత్రువులు, ప్రాణాలు పణంగా పెట్టేంత ప్రమాదాలు ఎటు వైపు నుండి, ఎవరెవరు ఎలా వస్తున్నారో ఊహించనంత భారీ స్థాయిలో మేకింగ్‌తో కట్టి పడేశాడు డైరెక్టర్‌ సుజిత్‌. మరి హాలీవుడ్‌ మేకింగ్‌ రేంజ్‌ అన్నారు కదా.. అంతకు తక్కువ కాకుండానే డిజైన్‌ చేశారు. హాలీవుడ్‌ టెక్నీషియన్లు ఈ సినిమాకి వర్క్‌ చేశారు కదా. రేంజ్‌ ఇలాగే ఉండాలి మరి. టీజర్‌ చివర్లో, ఇలా తమ వెంట పడుతున్నవారు ఎవరు.? అని హీరోయిన్‌ అడిగితే, ఫ్యాన్స్‌ అంటూ ఫ్యాన్స్‌ని బుట్టలో వేశాడు ప్రబాస్‌. మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటీ.? అంటే డై హార్డ్‌ ఫ్యాన్స్‌ అని మరోసారి మోసేశాడు. అలా 'సాహో' టీజర్‌ అంచనాలను ఏమాత్రం తీసిపోకుండా, ఇంతవరకూ ఉన్న హైప్‌ని పదింతలు చేసేలా ఉంది. చూడాలి మరి ఈ టీజర్‌తో ఇంకెన్ని సంచలనాలు సృష్టించనున్నాడో ప్రబాస్‌.

ALSO SEE : Saaho Teaser

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS