చందమామ ఎంతందంగా ఉంటుంది. వెన్నెల ఎంత హాయిగా ఉంటుంది. ఆస్వాదించిన వారందరికీ తెలుసు ఆ ఫీలింగ్ విలువెంతో. అలాగే అందానికే కొత్త అర్ధం తెచ్చిన అందం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెల్లాది. మిస్ దివా, మిస్ యూనివర్స్ 2015 వంటి కిరీటాలున్నాయి. కానీ, అవేమీ అమ్మడి అందాన్ని బేరీజు వేయలేవు. అంతటి అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. పోత పోసిన శిల్పం అంటే ఊర్వశీనే. ఇంద్రలోకంలోని రంభ, ఊర్వశీ, మేనక వంటి అప్సరసల అందాలన్నింటినీ మిక్సీలో వేసి, ఆ బ్రహ్మ దేవుడు పోత పోసిన శిల్పమే ఇలా ఊర్వశిగా ఈ భూలోకంలో, అదీ కలియుగంలో అవతరించిందా అన్నట్లుంటుంది. అయితే ఊర్వశి అందానికి తగ్గ గుర్తింపు దక్కడం లేదు కెరీర్లో.
'హేట్ స్టోరీ 4'తో ఓ ఊపు ఊపేసింది. కానీ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. ఒకటీ అరా చిత్రాలతోనే సరిపెడుతోంది. ప్రస్తుతం అలా ఓ రెండు ప్రాజెక్టులు ఊర్వశి చేతిలో ఉన్నాయి. సినిమాల సంగతి అలా ఉంటే, సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తన అందాలకు మరింత పదును పెట్టి, హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది. అలా ఈ తాజా పిక్ విషయానికొస్తే, రెడ్ అండ్ వైట్ చెక్స్ టూ పీస్ మోడ్రన్ షార్ట్ కాస్ట్యూమ్‌లో ఊర్వశి అందాల ఎంతలా మెరిసిపోతున్నాయో చూశారుగా. సహజంగా ఈ చెక్స్ ఏమంత అందంగా అనిపించవు. అది కూడా రన్నింగ్ చెక్స్. కానీ, అవి ఊర్వశి అందాల మేని ఛాయపై మెరిసి, వాటి అందాన్ని మరింత పెంచుకున్నాయి. రింగు రింగుల షార్ట్ హెయిర్, స్క్వేర్ షేప్ ఇయర్ రింగ్స్ ఆమె అందానికి మోడ్రన్ టచ్ ఇచ్చి మురిసిపోతున్నాయి.