యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్‌కి 'బాహుబలి'తో యూనివర్సల్ స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ ఇమేజ్‌తో తన నుండి తర్వాత వచ్చే సినిమా కూడా ఆ స్థాయి అంచనాల్ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో 'సాహో' సినిమాకి సై అన్నాడు ప్రబాస్. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అత్యంత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది.
కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న దర్మిలా తాజాగా చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారమ్ ప్రకారం 'సాహో' వచ్చే ఏడాది ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొన్నా మధ్య టీజర్‌నీ, ఛేజింగ్ మేకింగ్ వీడియోలను విడుదల చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసిన 'సాహో' టీమ్ లేటెస్టుగా రిలీజ్ డేట్ ప్రకటించి మరోసారి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
'బాహుబలి' తర్వాత ప్రబాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో, ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా.? అని అభిమానుల్లో తీరని ఆశక్తి నెలకొంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నుండి పలువురు ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ చిత్రాలను ఎన్నో అందించిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ 'సాహో' చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోంది.