'సాహో' ట్రైలర్‌: స్టేడియంలో 'సిక్సర్‌'!

మరిన్ని వార్తలు

డార్లింగ్‌ ప్రబాస్‌, ఫ్యాన్స్‌కి ఫుల్‌ మీల్స్‌ రేంజ్‌లో సర్‌ప్రైజ్‌ ఇచ్చేశాడు. 'సాహో' ట్రైలర్‌ రిలీజైంది. మాటల్లేవ్‌. మాట్లాడుకోవడాల్లేవ్‌ అన్నట్లుగానే ఉంది. 'అశోక చక్రవరి'్త అనే అండర్‌ కవర్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. 2 వేల కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించిన కేసును ఛేధించేందుకు పోలీసులు ఈ అశోక చక్రవర్తిని రంగంలోకి దించుతారు. అక్కడితో స్టార్ట్‌ అయిన ట్రైలర్‌.. క్రైమ్‌ బ్రాంచ్‌ ఆఫీసర్‌ అమృతరావ్‌గా శ్రద్ధాకపూర్‌ని పాత్రను చూపించారు. హీరో, హీరోయిన్‌ ఇద్దరూ ఫుల్‌ ఆఫ్‌ యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. మధ్య మధ్యలో రొమాంటిక్‌ సన్నివేశాల్ని కూడా జోడించారు.

 

'బిల్లా' ఫ్లేవర్‌ కనిపించింది ఎంటర్‌టైన్‌మెంట్‌ మోడ్‌లో ప్రబాస్‌ ఆటిట్యూడ్‌ చూస్తే. యాక్షన్‌తో స్టార్ట్‌ అయిన ట్రైలర్‌ కాస్తా, రొమాంటిక్‌ మూడ్‌లోకి మార్చేశారు. ఆ తర్వాత మళ్లీ యాక్షన్‌ మోడ్‌ టచ్‌ చేశారు. సో టోటల్‌గా యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా 'సాహో'ని పకడ్భంధీగా తెరకెక్కించినట్లు ట్రైలర్‌ ద్వారా అర్ధమవుతోంది. ఇక ఆ 2 వేల కోట్ల భారీ మొతం ఎందుకు చోరీ జరిగింది.? ఆ కేస్‌ని అశోక చక్రవర్తి, అమృతారావ్‌లు ఎలా చేధించారు.? ఈ క్రమంలో వారు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు.? తెలియాలంటే 'సాహో' సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే. సినిమాలో విలన్స్‌ని ఇంతవరకూ పోస్టర్స్‌ రూపంలో పరిచయం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు వారందరికీ ట్రైలర్‌లోనూ చోటు దక్కింది.

 

సినిమాకి ఖర్చు చేసిన భారీ బడ్జెట్‌ అంతా విజువల్‌లో అద్భుతంగా కనిపించింది. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం యాక్షన్‌ మోడ్‌కి పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యింది. 'రన్‌ రాజా రన్‌' వంటి సినిమాని తెరకెక్కించిన సుజిత్‌, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిందా.? అని ఆశ్చర్యపోయేంతలా విజువల్స్‌ ఉన్నాయి. టోటల్‌గా 'ఓ రేంజ్‌'లోనే 'సాహో' ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఆ రేంజ్‌ని సాహో అందుకుందో లేదో తెలియాలంటే ఆగస్ట్‌ 30 వరకూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS