'సాహో' నుంచి సూప‌ర్ న్యూస్‌.. ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది.

By iQlikMovies - June 01, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానుల‌కు ఓ శుభ‌వార్త‌. 'సాహో' కి సంబంధించిన సూప‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైల‌ర్ ఈ వారంలో విడుద‌ల కాబోతోంది. ట్రైల‌ర్ ఎప్పుడ‌నేది రేపు (ఆదివారం) చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతోంది. సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్ర‌ద్దాక‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో రెండు టీజ‌ర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అందులో ఒక్క డైలాగ్ కూడా వినిపించ‌లేదు.

 

క‌నీసం `సాహో` బ్యాక్ గ్రౌండ్ కూడా తెలీలేదు. కొత్త ట్రైల‌ర్లో అందుకు సంబంధించిన క్లూ ఇవ్వ‌బోతోంది చిత్ర‌బృందం. కొన్ని డైలాగులు కూడా ఈ ట్రైల‌ర్లో వినిపించ‌బోతున్నాయి. ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే... సంగీత ద‌ర్శ‌కులు శంక‌ర్ ఎహ్‌సాన్ లాయ్ ఈ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డంతో కొత్త సంగీత ద‌ర్శ‌కుడి కోసం వేట మొద‌లైంది. త‌మ‌న్ పేరు ప‌రిశీలించినా, త‌న‌కున్న బిజీ క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల ఈ సినిమా చేయ‌లేక‌పోతున్నాడ‌ని తెలుస్తోంది. కొత్త సంగీత ద‌ర్శ‌కుడ్ని సైతం... ట్రైల‌ర్లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS