శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్... సోషల్ మీడియాలో భలే ఫ్యామస్. వన్ సినిమాలో ఆఫర్ ముందు తనకే వచ్చిందని, నాన్నకు ప్రేమతో సినిమాలో తొలి హీరో తనే నని, లావణ్య త్రిపాఠీ తన లవర్ అని... ఏదేదో మాట్లాడి - యూ ట్యూబ్ ఛానళ్లని ఆకర్షించాడు. తన ఇంటర్వ్యూలు ఏదో ఓ ఛానల్ లో వస్తూనే ఉంటాయి. తను చెబుతున్నవన్నీ అబద్ధాలని తెలుసు. అయినా యూ ట్యూబ్ ఛానల్ వాళ్లు ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటారు. తను అబద్దాలు చెబుతూనే ఉంటాడు. ఎట్టకేలకు సునిశిత్ జోరుకి బ్రేక్ పడింది.
సునిశిత్ ఇంటర్వ్యూలనే సుమోటో కేసుకు ఆధారాలుగా సేకరించి.. హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇది వరకే లావణ్య త్రిపాఠి కూడా సునిశిత్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. సీబీఐలో తాను పనిచేస్తానని, లోకల్ పోలీసులంతా తనకు తెలుసని, తాను కనిపిస్తే అంతా దండాలు పెడతారని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సునిశిత్. దాంతో.. పోలీసులు సునిశిత్పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఇది వరకు కూడా సునిశిత్ పై రెండు మూడు కేసులు ఉన్నాయి.
సునిశిత్ మానసిక పరిస్థితి బాగానే ఉందని, కేవలం ప్రచారం కోసమే ఇలా అబద్ధాలు చెబుతాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి కొన్నాళ్ల పాటు యూ ట్యూబ్ ఛానళ్లని పోషించిన సునిశిత్ ఇప్పుడు కటకటాలులెక్కిస్తున్నాడు.