`భీమ్లా నాయక్`తో రేసులోకి వచ్చాడు సాగర్ చంద్ర. ఇది వరకే `అప్పట్లో ఒకడుండేవాడు` తీసినా, కమర్షియల్ గా సాగర్ బలాబలాలేమిటో ఎవరికీ తెలీదు. `భీమ్లా నాయక్`తో అవి క్లియర్‌కట్ గా అర్థమయ్యాయి. ఓ కమర్షియల్ హీరోని హ్యాండిల్ చేయగలడు అనే నమ్మకం ఏర్పడింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ఓసినిమా చేయడానికి సాగర్ ఇది వరకే ఒప్పందం కుదుర్చుకున్నాడు. సాగర్ దగ్గర రెండు కథలు ఉన్నాయి. రెండూ కమర్షియల్ స్టోరీలే. వాటిలో ఓ సినిమాకి `టైసన్ నాయుడు` అనే టైటిల్ అనుకుంటున్నారు.
రామ్ లేదా, నానిలలో ఒకరికి ఈ కథ సూటవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ కథకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. పర్‌ఫెక్ట్ గా స్క్రిప్టు సిద్ధమయ్యాక... హీరోలకు వినిపించడం, వాళ్ల వెసులుబాటుని బట్టి, ఓ హీరోని ఎంచుకోవడం జరుగుతుంది. మరి ఆ టైసన్ నాయుడుగా కనిపించే హీరో ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.