డిశంబర్ 1న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన 'జవాన్' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్లాప్ సినిమాల గురించి సాయి ధరమ్ తేజ్ దగ్గర ప్రస్థావన వచ్చింది. 'సుప్రీమ్' సినిమాతో మంచి విజయం అందుకున్న తేజు, ఆ తర్వాత వరసగా రెండు పరాజయాలు చవి చూశాడు. అవి 'తిక్క', 'విన్నర్'.
అదే విషయం ఆయన్ని అడిగారు. రెండు సినిమాలతో వరుస పరాజయాల్ని అందుకున్నారు కదా అని అడిగితే, రెండు కాదు మూడు పరాజయాలు అని నవ్వేశాడు తేజు. అంటే తేజు దృష్టిలో 'తిక్క', విన్నర్'తో పాటు 'నక్షత్రం' సినిమా కూడా ఉందన్న మాట. అలా మూడు ఫ్లాప్‌లు చవి చూశాడు ఈ మధ్య తేజు. ఫ్లాప్‌ని ఫ్లాప్‌గా ఒప్పుకోవడం కూడా కళే. ఆ కళ తేజులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆయన చేసిన సినిమాల్లో ఏ సినిమా బాగా ఇష్టం అంటే, అన్ని సినిమాల్ని ఇష్టపడే చేస్తాను. ఫ్లాప్ సినిమాలు నచ్చలేదు అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతీ సినిమాని ఎంతో ఇష్టపడి, కష్టపడి చేస్తాం.
అయితే కొన్ని సినిమాల విషయంలో ఈక్వేషన్స్ సెట్ కావు. సో అలా అవి ఫ్లాప్ సినిమాలుగా మిగిలిపోతాయి అంతే.. అని తేజు సెలవిచ్చాడు. ఇక తాజా సినిమా విషయానికి వస్తే, 'జవాన్' ఇంటికొక్కడు అనే క్యాప్షన్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సమాజానికి ఓ మంచి మెసేజ్‌తో పాటు, బాధ్యత, ప్రేమలు కలబోసిన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ ఇది. బి.వి.యస్.రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ట్రైలర్ చూశాక ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. చూడాలి మరి మన 'జవాన్' జనాన్ని ఎలా మెప్పిస్తాడో!