యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు.. రాత్రి కొద్ది సేపటి క్రితం సాయిధరమ్ తేజ్ హైదరాబాద్ దుర్గమ చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సాయిధరమ్ తేజ్ తలకి, కళ్లకి తీవ్రంగా గాయాలైనట్టు సమాచారం. మెడికోర్ ఆసుపత్రిలోని ఐసీయూలో సాయిధరమ్ తేజ్‌కి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోడ్డుపై.. ఇసుక ఉండడంతో బైక్ స్కిట్ అయినట్టు సమాచారం. దాంతో.. తలకు, వెన్నెముక, కన్నుకి సైతం గాయాలైనట్టు సమాచారం.
సన్నిహితులైతే.. ఈగాయాలైతే మరీ ప్రమాదకరమైనవి కావని చెబుతున్నారు. సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ లో 70 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేసినట్టు, రోడ్డుపై ఇసుక భారీగా పేరుకు పోవడంతో.. బైక్ జారిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
సాయిధరమ్ తేజ్‌ని 24 గంటలలోపు.. అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు డాక్టర్లు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. సాయిధరమ్ తేజ్ గాయపడిన వార్త తెలియగానే మెగా కుటుంబం ఇప్పుడు మెడికోర్ ఆసుపత్రికి చేరుకున్నారు. మాదాపూర్ పోలీసులు బైక్ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.