మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజ్ మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో తనపై వచ్చిన విమర్శల్ని తట్టుకుని నిలబడి ఇప్పుడు తన నటనతో వాటికి సమాధానం చెప్తున్నాడు. యాక్సిడెంట్ తరవాత విరూపాక్ష మూవీతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. తరవాత పవన్ కళ్యాణ్ తో కలిసి 'బ్రో' తో వచ్చాడు. మళ్ళీ ఇప్పటి వరకు తన నెక్స్ట్ మూవీ ఏంటి అన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం తేజ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నప్పటికీ బడ్జెట్ సమస్యల కారణంగా అవి హోల్డ్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దీనితో గతంలో తన కెరియర్ కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చిత్రలహరి మూవీ సీక్వెల్ పై తేజ్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారని సమాచారం.
తేజ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి అన్నీ డిజాస్టర్లే. సుప్రీమ్ తేజ్ కి మొదటి హిట్ అని చెప్పాలి. తరవాత 2019లో రిలీజైన చిత్రలహరి ద్వారా తేజ్ ఖాతాలోకి మరొక హిట్ వచ్చింది. వరుస ఫ్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో తేజ్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. వసూళ్ల పరంగా కూడా ఈ మూవీ హిట్ . 25 కోట్ల కలెక్షన్స్ తో తేజ్ కెరియర్ ని నిలబెట్టింది. ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్, హీరోయిన్స్ గా నటించారు. మోటివేషనల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాను తిరుమల కిషోర్ డైరక్ట్ చేసాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇలాంటి సినిమాకి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
సేమ్ అదే టీమ్ తో మళ్ళీ ఈ మూవీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. సాయితేజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో డైరెక్టర్ తిరుమల కిషోర్ చిత్రలహరి 2 ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టినట్టు సమాచారం. త్వరలోనే ఈ సీక్వెల్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.