తేజ్- ఐ లవ్ యు షూటింగ్ వివరాలు

By iQlikMovies - May 07, 2018 - 18:44 PM IST

మరిన్ని వార్తలు

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రేమకథా చిత్రాలకి కేర్ అఫ్ అడ్రస్ గా పేరుగాంచిన కరుణాకరణ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు అనే చిత్రాన్ని సాయి ధరం తేజ్ నటిస్తున్నాడు.

ఇక ఈ చిత్ర యూనిట్ ఒక పెద్ద ఫారెన్ షెడ్యూల్ ని ఈరోజు ముగుంచింది. ఈ విషయాన్నీ స్వయంగా హీరోనే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అందరితో పంచుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తవ్వగా, ఈ సినిమాతో కచ్చితంగా సాయి ఎదురు చూస్తున్న హిట్ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ నిలవనుంది అన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రంలో సాయి ధరం తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నది అలాగే ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ తరపున కేఎస్  రామారావు నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS