అమ్మ అయ్యాక కూడా చేస్తా: సమంతా

మరిన్ని వార్తలు

సమంతా- ఈ పేరు వింటే ఒకప్పుడు మనందరికీ టాప్ హీరోయిన్ గుర్తొచ్చేది. కాని ఇప్పుడు హీరోయిన్ తో పాటుగా అక్కినేని వారి ఇంటి పెద్ద కోడలుగా కూడా కొత్త సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. 

ఇక ఆమె పెళ్ళికి ముందే పెళ్ళి అయ్యాక  కూడా సినిమాలు చేస్తాను అని చెప్పింది, ఇప్పుడు అదే దారిలో నడుస్తున్నది. ఇదిలావుండగా, సమంతా ప్రస్తుతం మరొక సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే- తాను ఒక బిడ్డకి జన్మనిచ్చక కూడా సినిమాలలో తన ప్రయాణం కొనసాగిస్తాను అని చెప్పేసింది. దీనితో తమకి శుభవార్త త్వరలో ఎప్పుడు చెప్తావు అని సోషల్ మీడియాలో అప్పుడే ఆమెని అందరు టార్గెట్ చేసేశారు.

ఇక ప్రస్తుతం సమంతా చేసిన రెండు తెలుగు సినిమాలు రంగస్థలం & మహానటి. రంగస్థలంలో అయితే అద్బుతమైన నటనని ప్రదర్శించగా ఎల్లుండి విడుదలయ్యే మహానటిలో ఎలా నటించిందో తెలియాలి అంటే ఈ నెల 9న తేదీన ప్రపంచవ్యప్త్నగా విడుదల కానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS