విడుదలకి ముందే నష్టాల్లో నేల టిక్కెట్టు

మరిన్ని వార్తలు

మాస్ మహారాజ రవితేజ తాజా చిత్రం నేల టిక్కెట్టు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధాన కారణాలు గా- ఈ సినిమా మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం, సినిమా చూసిన ప్రేక్షకులకి తీవ్ర నిరాశకి గురిచేయ్యడం వంటివి తెలుస్తున్నది.

ఇక ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో చిత్రాన్ని పంపిణీ చేసిన పంపిణీదారులకి తీవ్ర నష్టాలు వచ్చాయి అని అనుకున్నారంత! అయితే అసలు నిజమేంటంటే, ఈ సినిమాని విడుదలకి ముందు ఎవరు కొనలేదట, దానితో నిర్మాతలే రూ 10 కోట్ల నష్టానికి ఈ చిత్రాన్ని విడుదలచేశారట. దీనితో ఈ సినిమా విడుదలకి ముందే నష్టాల్లో ఉందని అర్ధమవుతుంది.

ఈ సంగతి అటుంచితే, నేల టిక్కెట్టు డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి ధర పలికినట్టు సమాచారం. సుమారు రూ 18 కోట్లకి ఈ రెండు రైట్స్ అమ్ముడయినట్టుగా తెలిసింది. ఇక ఆ రైట్స్ రూపంలో వచ్చిన డబ్బులు మినహా మరేమీ రాలేదు అని అంటున్నారు.

ఏదేమైనా.. ఈ సినిమా మాత్రం ఇటు నిర్మాతలని అటు ప్రేక్షకులని నిరాశకి గురిచేసిందనే చెప్పాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS