'రాజా' సెట్లో తేజు ఏం చేస్తున్నాడు?

మరిన్ని వార్తలు

మాస్‌ రాజా రవితేజ కొత్త సినిమా 'రాజా ది గ్రేట్‌' సెట్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ సందడి చేశాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్‌' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర యూనిట్‌తో సాయి ధరమ్‌ తేజ్‌ దిగిన ఫోటో ఒకటి మీడియాలో ప్రత్యక్షమయ్యింది. ఈ ఫోటోలో రవితేజ, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, రాశీఖన్నాతో పాటు సాయి ధరమ్‌ తేజ్‌ ఉన్నారు. సాయి ధరమ్‌ తేజుకి ఇండస్ట్రీలో చాలా పరిచయాలున్నాయి. అందరితోనూ కలుపుగోలుగా ఉండే వ్యక్తిత్వం ఉన్నోడు తేజు. ఈ సినిమా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడితో తేజు 'సుప్రీమ్‌' సినిమా చేశాడు. ఈ సినిమా ఇద్దరికీ మంచి విజయం తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం 'రాజా ది గ్రేట్‌' సెట్‌లో ఏం చేస్తున్నట్లు మనోడు? అంటే తేజు ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేస్తున్నాడేమో అనుకోవాల్సి వస్తోంది. మొన్నీ మధ్యనే సందీప్‌ కిషన్‌ హీరోగా వచ్చిన 'నక్షత్రం' సినిమాలో అలెగ్జాండర్‌గా గెస్ట్‌ పాత్రలో కనిపించి మెప్పించాడు తేజు. అలాగే ఈ సినిమాలో కూడా ఏదైనా కీ రోల్‌ పోషిస్తున్నాడో ఏమో తేజు. రాశీఖన్నా అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ చేస్తోంది. మెహరీన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే మాస్‌ మహరాజ్‌ రవితేజ కొడుకు మహాధన్‌ సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. అంధుడి పాత్రలో నటిస్తున్నాడు రవితేజ ఈ సినిమాలో. ఒకవేళ తేజు అప్పియరెన్స్‌ కూడా ఉండి ఉంటే ఈ సినిమాకి అదో స్పెషల్‌ ఎట్రాక్షనే అనుకోవాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS