సాయి ధరం తేజ్ జవాన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నది.
మొదటిరోజు కలెక్షన్స్ పరంగా సాయి కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలవగా మొదటి మూడు రోజుల కలెక్షన్స్ చూసిన కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, జవాన్ చిత్రం రూ 13 కోట్ల (గ్రాస్) & రూ 8 కోట్ల (షేర్) మేర వసూళ్లు సాధించినట్టు తెలుస్తున్నది.
ఇక జవాన్ తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పటికైతే పర్వాలేదు అన్న రేంజ్ లో కలెక్షన్స్ సాగుతుండగా మొదటి వారం ఏమేరకు కలెక్ట్ చేస్తుందో అన్న చర్చలు మొదలయ్యాయి.
మొత్తానికి జవాన్ చిత్రంతో సాయి ధరం తేజ్ ఫ్లాపులకి ముగింపు పలికాడు.