కిర్రాకు పుట్టిస్తోన్న 'సుప్రీమ్‌' హీరో

మరిన్ని వార్తలు

'సుప్రీమ్‌' సినిమాతో కెరీర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తర్వాత వరుస పరాజయాలతో నిరాశ పరిచాడు. 'సుప్రీమ్‌' హిట్‌ని మళ్లీ అందుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతీ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొంటున్నప్పటికీ, అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నాడు. 

మాస్‌ అండ్‌ మెగా డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌తో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన 'ఇంటెలిజెంట్‌' మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు తేజు. కానీ అనూహ్యంగా ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. దాంతో ఇప్పుడు తేజుకి అర్జెంటుగా ఓ హిట్‌ పడాల్సిన అవసరం ఉంది. ఆ హిట్‌ కరుణాకరన్‌తో తేజు చేయబోయే చిత్రంతోనే వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

ఇదో లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ మూవీ. రొమాంటిక్‌ చిత్రాల డైరెక్టర్‌గా ఆల్రెడీ కరుణాకరన్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ఈ నెల 28న విడుదల చేయనున్నామంటూ చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. తన వీపుకు గిటార్‌ తగిలించుకుని వెనుకకు తిరిగినట్లుగా ఉన్నాడు తేజు ఈ పోస్టర్‌లో. బ్యాక్‌ గ్రౌండ్‌లో హీరోయిన్‌ కనీ కనిపించనట్లుగా ఉంది. టోటల్‌గా ఈ పోస్టర్‌తో ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ అప్పీల్‌ని తీసుకొచ్చారు. 

ఇక రాబోయే ఫస్ట్‌లుక్‌తో ఇంకెంత కిర్రాకు పుట్టిస్తాడో మనోడు చూడాలిక. తేజుకిది 10వ చిత్రంగా కాగా, ఈ సినిమాలో ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌ తేజుతో జోడీ కడుతోంది. సి.సి. మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో కె.ఎస్‌.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS