తేజు 'చిత్రలహరి' మొదలెట్టేస్తాడట.!

By iQlikMovies - July 31, 2018 - 16:31 PM IST

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు తేజుకి ఈ మధ్య ఏది పట్టినా కలిసి రావడం లేదు. విడుదలకు ముందు ఎన్ని అంచనాలు నమోదు చేసినా విడుదలయ్యాక తేజుని ఆదుకోవడం ఎవ్వరి వల్లా కావడం లేదు. 'తేజ్‌ ఐ లవ్‌యూ' అంటూ వచ్చి, ఇటీవల మరోసారి బోర్లా పడ్డాడు. 

ఇక తేజు తర్వాతి చిత్రం సెన్సేషనల్‌ బ్యానర్‌ మైత్రీ మూవీస్‌లో రూపొందనుంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పుడు అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి 'చిత్రలహరి' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. వరుస పరాజయాలతో నిరాశపడిన తేజు ప్రస్తుతం రీ ఫ్రెష్‌మెంట్‌ కోసం విదేశాల్లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. 

అలాగే ఈ మధ్య కాస్త బరువు పెరిగిన తేజు, ఆ పెరిగిన బరువును తగ్గించే ప్రయత్నాల్లో కూడా ఉన్నాడట. ఫుల్‌ మేకోవర్‌తో తేజు ఫ్రెష్‌గా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడట తాజా చిత్రం కోసం. సెప్టెంబర్‌లో ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోందట. ఇకపోతే, మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో సినిమా అంటేనే అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి 'రంగస్థలం' ఎఫెక్ట్‌తో. సో మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో సినిమా అంటే అంత ఆషా మాషీ కాదిప్పుడు. 

ఇకపోతే డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల విషయానికి వస్తే, తొలి సినిమా 'నేను శైలజ'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాడు. రెండో సినిమా 'ఉన్నది ఒక్కటే జిందగీ'తో ఢీలా పడ్డాడు. ఇక ముచ్చటగా మూడో సినిమాతో మొదటి సినిమా రేంజ్‌లో హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడట. అందుకు తగ్గట్లుగానే స్టోరీ ప్రిపేర్‌ చేశాడట. 'నేను శైలజ' రొటీన్‌ స్టోరీ అయినా కానీ, స్క్రీన్‌ప్లేతో ఎక్కువ మార్కులు కొట్టేశాడీ యంగ్‌ డైరెక్టర్‌. అందుకే తాజా చిత్రం స్క్రీన్‌ప్లేకి పక్కా స్కెచ్‌ ప్రిపేర్‌ చేస్తున్నాడట. చూడాలి పర్‌ఫెక్ట్‌ స్కెచ్‌తో తనతో పాటు, తేజుకి పవర్‌ ఫుల్‌ హిట్‌ ఇస్తాడో? లేదో? మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS