తన డైరెక్టర్ ని ఛాలెంజ్ చేసిన మహేష్

By iQlikMovies - July 31, 2018 - 13:16 PM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వంశీ పైడిపల్లికి ఒక ఛాలెంజ్ విసిరాడు. అయితే ఆ ఛాలెంజ్ సినిమాకి సంబంధించి మాత్రం కాదు. ఈ క్రింద చదివితే అసలు విషయమేంటో మీకే తెలుస్తుంది.  

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశ్యంతో ప్రముఖ సెలబ్రిటీలందరిని ట్విట్టర్ లో మూడు మొక్కలు నాటమంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్, కవిత ఒక ఛాలెంజ్ చేస్తున్నారు.

అందులో భాగంగానే కేటీఆర్ చేసిన ఛాలెంజ్ కి మహేష్ బాబు స్పందిస్తూ మూడు మొక్కలు నాటుతున్న ఫోటోలని తన ట్విట్టర్ ద్వారా అందరికి షేర్ చేశాడు. ఇక తన తరువాత తన ఇద్దరు పిల్లలకి, దర్శకుడు వంశీ పైడిపల్లి కి ఈ ఛాలెంజ్ ని చేశాడు.

మరి దర్శకుడు, మహేష్ పిల్లలు కూడా త్వరలోనే ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తారు అని ఆశిద్దాం..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS