సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ నిర్ణయం ఫిలిం నగర్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకి ఆ నిర్ణయం తేజ్ ఐ లవ్ యు సినిమాకి సంబంధించినది అని సమాచారం.
ఇక వివరాల్లోకి వెళితే, సాయి తాను నటించిన తేజ్ చిత్రానికి సంబంధించి రెమ్యునరేషన్ ఏమి తీసుకోలేదు అని తెలుస్తున్నది. సినిమా విడుదలై హిట్ అయ్యాక వచ్చే లాభాల్లో షేర్ తీసుకుంటాడు అని సమాచారం. అయితే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అన్న దానికి మాత్రం సరైన కారణం తెలియరాలేదు.
కాకపోతే వరుసగా ఫ్లాప్స్ రావడంతో తేజ్ కూడా ఒక మంచి దర్శకుడితోనే తదుపరి సినిమా చేయాలి అనే ఉద్దేశ్యంతో కరుణాకరన్ తో ఈ సినిమా చేయడానికి మొగ్గుచూపినట్టుగా అర్ధమవుతున్నది. అయితే కథ పైన ఉన్న నమ్మకమే తనని ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందంటూ అంటున్నవారు కూడా లేకపోలేదు.
మరి ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించి తేజ్ కి ఒక మంచి హిట్ తో పాటుగా లాభాల్లో వాటా కూడా రావాలని కోరుకుందాం...