ఈ సారి తేజు ఇలా ట్రై చేస్తున్నాడట.! ఇప్పుడైనా కలిసొస్తుందా..?

By iQlikMovies - December 12, 2018 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు, సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తాజాగా 'చిత్రలహరి' సినిమాలో నటిస్తున్నాడు. కిషోర్‌ తిరుమల ఈ సినిమాకి దర్శకుడు. కాగా ఈ సినిమా టైటిలే అందరిలోనూ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది. అప్పుడెప్పుడో దూరదర్శన్‌ ఉన్న టైంలో ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన పేరు ఈ 'చిత్రలహరి'. అక్కడి నుండే ఈ టైటిల్‌ని పట్టుకొచ్చారా.? అసలు ఈ సినిమా కథా, కమామిషు ఎలా ఉండబోతోంది అనే విషయాలపై ఆశక్తి పెరిగింది. అయితే ఈ టైటిల్‌లోని 'చిత్ర', 'లహరి' పేర్లు హీరోయిన్స్‌ పేర్లని తాజాగా అందుతోన్న సమాచారమ్‌.

అంటే ఈ సినిమాలో హీరోయిన్స్‌ క్యారెక్టర్స్‌కి అత్యంత ప్రాధాన్యత ఉండబోతోందట. ఇంతకీ ఆ హీరోయిన్స్‌ ఎవరనే కదా. 'మెంటల్‌ మదిలో' చిత్రంలో శ్రీవిష్ణు సరసన నటించిన 'నివేదా పేతురాజ్‌' ఒకరు కాగా, 'హలో'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కళ్యాణీ ప్రియదర్శన్‌ ఇంకో హీరోయిన్‌గా నటిస్తోంది. తొలి సినిమాలతోనే పర్‌పామెన్స్‌ పరంగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సత్తా చాటారు.

సో ఎలాంటి బరువైన పాత్రలైనా డీల్‌ చేయగల సత్తా ఈ బ్యూటీస్‌లో ఉందని ప్రూవ్‌ అయిపోయింది. ఈ మధ్య వరుస ఫ్లాపులతో తేజు సతమతమవుతున్నాడు. ఒకవేళ ఈ ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు చెప్పి అయినా 'చిత్రలహరి' తనకు కలిసొస్తుందేమో చూడాలిక. ఈ మూవీకి రాకింగ్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS