జబర్దస్త్‌ స్టేజ్‌ని తేజు బాగా వాడేశాడు.!

మరిన్ని వార్తలు

జబర్దస్త్‌ అంటే నాగబాబు గుర్తొస్తారు. కానీ, ఇప్పుడు ఆ స్టేజ్‌కి ఆయన గుడ్‌బై చెప్పేశారు. అనూహ్యంగా ఆయన ప్లేస్‌లో మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ ప్రత్యక్షమయ్యాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే' సినిమా ప్రమోషన్స్‌ నిమిత్తం తేజు జబర్దస్త్‌ స్టేజ్‌పై తళుక్కున మెరిశాడు. తమ తమ సినిమాల ప్రమోషన్స్‌ కోసం చాలా మంది హీరోలు ఈ స్టేజ్‌పై తళుక్కున మెరిసి ప్రమోషన్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, తేజు వచ్చిన ఈ ఎపిసోడ్‌ జబర్దస్త్‌కి స్పెషల్‌ ఎపిసోడ్‌ కావడం విశేషం. జబర్దస్త్‌ 350 వ ఎపిసోడ్‌ ఇది. మేనమామ నాగబాబు ఈ ఎపిసోడ్‌లో లేకపోవడం మరో విశేషం. తేజు ఎంట్రీనే స్పెషల్‌గా డిజైన్‌ చేశారు జబర్దస్త్‌ టీమ్‌.

 

అంతేకాదు, రోజా పర్మిషన్‌ మేరకు యాంకర్‌ అనసూయతో తేజు స్టెప్పులేయడం మరో ఎట్రాక్షన్‌. గతంలో వీరిద్దరూ కలిసి 'విన్నర్‌' సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో పర్‌ఫామ్‌ చేశారు. అదే 'సూయ సూయ.. అనసూయ..' సాంగ్‌. అదే సాంగ్‌కి ఇప్పుడు జబర్దస్త్‌ స్టేజ్‌పై డాన్సులేశారు. అంతేనా, ఓ స్కిట్‌లో పర్‌ఫామెన్స్‌ కూడా ఇచ్చేశాడు తేజు. అదే మెగా వీర ఫ్యాన్‌ హైపర్‌ ఆది స్కిట్‌. అలా 350వ జబర్దస్త్‌ ఎపిసోడ్‌ మెగా కలరింగ్‌తో సరికొత్త గ్లామర్‌ అద్దుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS