శుక్రవారం రాత్రి హైటెక్ సిటీ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన విషయం ఏమీ లేదని కుటుంబ సభ్యులు, డాక్టర్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తేజ్ తల, ఛాతి, వెన్నెముకకి గాయాలయ్యాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందా? లేదా? అనే అనుమానాలు ఉండేవి. అయితే అంతర్గతంగా ఎలాంటి బ్లీడింగ్ జరగలేదని తేలడంతో... డాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు.
సాయిధరమ్ తేజ్ మరో రెండు రోజుల పాట వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. న్యూరో సర్జన్ అలోక్ రంజన్, బాల వర్ధన్ ఆర్థోపిటిక్ డాక్టర్ల పర్యవేక్షణలో తేజ్‌కు చికిత్స కొనసాగుతోంది. ఈరోజు తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరో హెల్డ్ బులిటెన్ విడుదలయ్యే అవకాశం ఉంది.