మెగా పొలిటిక‌ల్ సెటైర్‌.... రిప‌బ్లిక్‌

By iQlikMovies - January 25, 2021 - 17:46 PM IST

మరిన్ని వార్తలు

సాయిధ‌ర‌మ్ తేజ్ - దేవాక‌ట్టా కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఐశ్వ‌ర్య రాజేష్ క‌థానాయిక‌. ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి `రిప‌బ్లిక్‌` అనే టైటిల్ ఖ‌రారు చేశారు. రేపు రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈరోజు మోష‌న్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు.

 

``యువ‌రాన‌న్ ప్ర‌జ‌లు ఎన్నుకున్న రాజ‌కీయ నాయ‌కులు, శాస‌నాన్ని అమ‌లు చేసే ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టు. ఈ మూడు గుర్రాలూ ఒక‌రి త‌ప్పుల్ని ఒక‌రు సరిదిద్దుకుంటూ, క్ర‌మ బ‌ద్ధంగా సాగిన‌ప్పుడే అది ప్ర‌భుత్వం అవుతుంది. అదే అస‌లైన రిప‌బ్లిక్‌`` అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ ని మోష‌న్ పోస్ట‌ర్ కి జోడించారు. ఇదో పొలిటిక‌ల్ సెటైర్‌. ఉద్య‌మాలు, రాజ‌కీయాల చుట్టూ సాగే క‌థ‌. ర‌మ్య‌కృష్ణ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్ గా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ వేస‌విలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS