ప్ర‌భాస్ క‌థ‌తో.. సూర్య‌?

By Gowthami - January 25, 2021 - 15:29 PM IST

మరిన్ని వార్తలు

ఓ హీరో కోసం అనుకున్న క‌థ మ‌రో హీరోకి వెళ్ల‌డం.. చిత్ర‌సీమ‌లో మామూలే. క‌థ‌లు మార‌డం అన్న‌ది చాలా కామ‌న్ పాయింట్. ఇప్పుడూ అదే జ‌రుగుతోంది. ప్రభాస్ కోసం త‌యారు చేసిన క‌థ సూర్య ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయింద‌ని టాలీవుడ్ లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. దాని పూర్వాప‌రాల్లోకి వెళ్తే..?! ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా చేయాల‌ని దిల్ రాజు ఈమ‌ధ్య ఫిక్స‌య్యారు. ప్ర‌భాస్ కోసం కొన్ని క‌థ‌లూ రెడీ చేశారు. బోయ‌పాటి శ్రీ‌ను చెప్పిన క‌థ‌ని దిల్ రాజు లాక్ చేశార‌ని స‌మాచారం.

 

అయితే ప్ర‌భాస్ కి ఉన్న క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల ఈ ప్రాజెక్టు చేయ‌డం కుద‌ర్లేదు. మ‌రో రెండేళ్ల వ‌ర‌కూ ప్ర‌భాస్ మ‌రో ద‌ర్శ‌కుడి క‌థ‌కు ఓకే చెప్పే అవ‌కాశం లేదు. అందుకే ఇప్పుడు ఈ క‌థ‌ని సూర్య‌తో చేయాల‌ని దిల్ రాజు డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. సూర్య‌తో చేయ‌డానికి బోయ‌పాటి శ్రీ‌ను కూడా రెడీగానే ఉండ‌డంతో.. ఈ ప్రాజెక్టు దాదాపు ఖాయం అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని టాక్‌. సూర్య‌కి తెలుగులో ఉన్న డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

 

సూర్య కూడా ఓ స్ట్ర‌యిట్ తెలుగు సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు. త‌న‌కి ఈ క‌థ బాగా న‌చ్చింద‌ని తెలుస్తోంది. బోయ‌పాటి ఇప్పుడు బాల‌య్య‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అద‌య్యాకే.. సూర్య సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్స్‌వుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS