తేజూ సినిమా రిలీజ్ కి ఢోకా లేన‌ట్టే!

By iQlikMovies - September 16, 2021 - 12:09 PM IST

మరిన్ని వార్తలు

రోడ్డు ప్ర‌మాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్ గాయ‌ప‌డ‌డం, ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం తెలిసిన విష‌యాలే. త‌ను ఆసుప‌త్రిలో ఉండ‌డం వ‌ల్ల‌... `రిప‌బ్లిక్‌` సినిమాపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ముంద‌స్తు షెడ్యూల్ ప్ర‌కారం ఈ సినిమాని అక్టోబ‌రు 1న విడుద‌ల చేయాలి. అయితే.. తేజ్ ఆసుప‌త్రిలో ఉండ‌డం వ‌ల్ల ఆయ‌న‌తో ప్ర‌చారం చేయించే వీలు లేకుండా పోయింది. దాంతో ఈ సినిమాని వాయిదా వేస్తార‌ని అనుకున్నారు.

 

కానీ... రిప‌బ్లిక్ సినిమా రిలీజ్ కి ఎలాంటి ఢోకా లేద‌ట‌. ముందే అనుకున్న‌ట్టు అక్టోబ‌రు 1నే ఈ సినిమాని విడుద‌ల చేసేస్తున్నారు. ఈసినిమా బిజినెస్ ముందే అయిపోయింది. జీ స్టూడియోస్ ఈ సినిమా థియేట‌రిక‌ల్ - నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ కొనేసింది. వాళ్ల‌దంతా కార్పొరేట్ స్టైల్‌. అనుకున్న స‌మ‌యానికి సినిమా రిలీజ్ చేసేస్తారు. కాబ‌ట్టి.. రిప‌బ్లిక్ నీ రంగంలోకి దించ‌డం గ్యారెంటీ. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర పోషించిన సినిమా ఇది. దేవాక‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ వారం నుంచే.. ప్ర‌మోష‌న్ల స్పీడు పెంచాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS