మెగా రీమేక్ కి సిద్దం అయిన మెగా అల్లుడు

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి పాటలు, డ్యాన్సులు ఎప్పటికి ఎవర్ గ్రీన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

అయితే ఆ పాటలని తన కుటుంబం నుండి వచ్చిన హీరోలు రీమేక్ చేస్తుండడం మనం చూశాం. అందులో ముఖ్యంగా ఆయన మేనల్లుడు సాయి ధరం తేజ్ ఇప్పటికి మూడు పాటలు రీమేక్ చేయడం జరిగింది. అయితే తరువాత కాలంలో ఏమైందో తెలియదు కాని సాయి ధరం తేజ్ ఇక పైన చిరంజీవి పాటలని రీమేక్ చేయను అని చెప్పడం జరిగింది. 

వీటన్నిటికి భిన్నంగా చిరంజీవి కొండవీటి దొంగ చిత్రంలో సూపర్ హిట్ అయిన ‘చమకు చమకు’ పాటని రీమేక్ చేస్తున్నాడు అని సమాచారం. వినాయక్ దర్శకత్వంలో సాయి ధరం తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ధర్మా భాయి’ సినిమాలో ఈ పాటని రీమేక్ చేస్తున్నాడట. 

కొండవీటి దొంగ చిత్రంలో ఇళయరాజా సంగీతంలో వచ్చిన ‘చమకు చమకు’ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. అలాంటిది ఇప్పుడు ఆ హిట్ పాటని రీమేక్ చేయనుండడంతో ఈ పాట పైన అంచనాలు పెరిగిపోయాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS