సాయి ధరం - వివి.వినాయక్ సినిమాకి టైటిల్ ఫిక్స్..!

మరిన్ని వార్తలు

కొన్ని రోజుల క్రితం ‘ధర్మా భాయి’ అనే టైటిల్ సాయి ధరం-వీవీ వినాయక్ కలయికలో వస్తున్న సినిమాకి పెట్టారు అంటూ ప్రచారం రావడం, ఆ టైటిల్ కూడా చాలా బాగా సూట్ అయింది అంటూ అనుకోవడం జరిగిపోయాయి. అయితే సీన్ కట్ చేస్తే ఆ టైటిల్ ఇప్పుడు నాగ చైతన్య సినిమాకి వెళ్ళినట్టు అలాగే సాయి ధరం సినిమాకి మరో టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఆ టైటిల్ ఏంటి అన్నది అలాగే సినిమా రిలీజ్ ఎప్పుడు అన్న విషయాలు నిర్మాత C కళ్యాణ్ తెలిపారు.

ఆయన మాటల్లో- సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి 'ఇంటెలిజెంట్‌' టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మస్కట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. 

ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. జనవరి 17 వరకు టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. చిరంజీవిగారికి 'ఖైదీ' ఓ మెమరబుల్‌ మూవీగా నిలిచింది. అలాగే 'ఇంటెలిజెంట్‌' సాయిధరమ్‌కి ఓ ల్యాండ్‌ మార్క్‌ మూవీ అవుతుంది'' అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS