మంచు విష్ణుకి ఈ నూతన సంవత్సరం ఎప్పటికి గుర్తుండిపోతుంది. దీనికి కారణం ఆయనకీ జనవరి 1వ తేదీన కొడుకు పుట్టడమే. ఇదవరకే మంచు విష్ణుకి ఇద్దరు సంతానం.
ఇక నిన్ననే మోహన్ బాబు ప్రతిక్షణం ఆయన తన మనవడితోనే గడుపుతున్నాను అంటూ ట్వీట్ కూడా చేశాడు. ఈ తరుణంలో ఆ చిన్నారి బాబుకి ఏం పేరు పెడతారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సమయంలోనే మంచు విష్ణు తన కొడుకు పేరుని అందరితోనూ పంచుకున్నాడు.
ఇంతకి ఆ పేరెంటంటే- అవ్రామ్ భక్త మంచు. అవ్రామ్ అంటే ఎదురులేని అని అర్ధం, అలాగే భక్త అనేది మోహన్ బాబు అసలు పేరు అయిన భక్తవత్సలం నాయుడు నుండి తీసుకున్నారు. మొత్తానికి తన తండ్రి పేరునే కొడుకుకి పెట్టి మోహన్ బాబు వారసుడిని ఆయన స్టైల్ లోనే అందరికి పరిచయం చేశాడు విష్ణు.
ఇక మనవడు వచ్చిన సందర్బంలో మంచు కుటుంబం మొత్తం వేడుకల్లో మునిగిపోయింది అనే చెప్పలి.