టాలీవుడ్ లో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఓ యంగ్ హీరో చేతుల్లోంచి ఓ సినిమా చేజాయిపోయింది. ఆ హీరో ఎవరో కాదు.. సాయిధరమ్ తేజ్. విరూపాక్ష తరవాత సాయిధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో 'గంజా శంకర్' అనే సినిమా పట్టాలెక్కింది. టైటిల్ గ్లింప్స్ ని కూడా చిత్రబృందం వదిలింది. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవ్వాల్సివుంది. అయితే ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా నుంచి సాయిధరమ్ తేజ్ తప్పుకొన్నాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.
ఈ సినిమా కోసం తేజ్ ఏకంగా రూ.15 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఓటీటీ, శాటిలైట్, డబ్బింగ్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఈ నేపథ్యంలో తేజ్‌కి రూ.15 కోట్ల పారితోషికం ఇవ్వడం రిస్కే అని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. తేజ్ కి రూ.15 కోట్లు ఇస్తే మేకింగ్ కి మరో 35 కోట్లు అవుతుంది. మొత్తంగా రూ.50 కోట్లు తేలుతుంది. అంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయడం కష్టమని నిర్మాతలు చేతులు ఎత్తేసినట్టు టాక్. దాంతో తేజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లిపోయాడట. మరో హీరో కోసం సంపత్ నంది ఇప్పుడు ఆఘ మేఘాల మీద అన్వేషణకు దిగాడని తెలుస్తోంది. మరి తేజ్ స్థానంలోకి వచ్చే ఆ కొత్త హీరో ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.