సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ విన్నర్ చిత్రంతో కమర్షియల్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నట్టుగానే కనిపిస్తుంది.
విడుదలైన మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ 6.5 కోట్లు వసూలు చేసి తేజ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది. మొదటిరోజు ఫ్లో రెండోరోజు కూడా కల్లెక్షన్స్ లో కనపడింది, అందుతున్న సమాచారం ప్రకారం రూ 10కోట్ల మార్క్ (షేర్) దాటిందట.
ఇదిలాఉంటే రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ 8.76 కోట్లు వసూలు చేసినట్టుగా ప్రాధమిక సమాచారం. ఇక మూడోరోజు ( సండే) కూడా సెలవు కావడంతో ఈ సినిమా కల్లెక్షన్స్ రేంజ్ పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.