స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పట్టాలెక్కింది. అయితే గత కొంతకాలంగా "పుష్ప" రెండవ పార్ట్ కథ గురించి నటీనటుల గురించి ఎన్నో వార్తలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. పుష్పలో నటించిన నటీనటులతో పాటు మరికొంత మంది కొత్త నటులు కూడా ఉండబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి పుష్ప 2 కనిపించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. లో అడవుల్లో కనిపించే గిరిజన యువతి రోల్ లో సాయి పల్లవి కనిపించనుందని అంటున్నారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.