‘పుష్ప: ది రూల్’ పనులు చకచకా జరుగుతున్నాయి. తొలి భాగం పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్‌తోనూ, డైలాగ్‌తోనూ అందరినీ ఆకట్టుకుంది. ఆ స్పందనని దృష్టిలో ఉంచుకునే కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్’ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు మేకర్స్.
ఇదీలావుంటే పార్ట్ 2 లో కొత్త పాత్రలకు కూడా అవకాశం వుంది. ఇప్పటికే కొన్ని పాత్రల కోసం పలు భాషల్లోని విలక్షణ నటులని తీసుకున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పుడు సాయి పల్లవి పేరు కూడా వినిపిస్తోంది. పార్ట్ 2 లో శ్రీవల్లితో పాటు మరో బలమైన స్త్రీ పాత్రని రాసుకున్నాడు సుకుమార్. హీరోయిన్ గా కాదు కానీ ఒక బలమైన రోల్. ఆ పాత్రకు సాయి పల్లవి సరిపోతుందని సుకుమార్ సంప్రదించడం, ఆమె ఒకే చేయడం జరిగిందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తారు.