మొదటి నుంచీ గ్లామర్‌కి చాలా చాలా దూరంగా వుంటూ వస్తోంది హీరోయిన్ సాయి పల్లవి. ఎక్స్‌పోజింగ్ అయితే చేయదుగానీ, హీరోలతో రొమాంటిక్ ట్రాక్ ఆన్ స్క్రీన్ నడపడంలో మాత్రం సాయిపల్లవికి నూటికి నూరు మార్కులూ పడతాయి. అదే ఆమె ప్రత్యేకత. ఇక, ‘ఫిదా’ సినిమాలో ఓ సన్నివేశంలో స్లీవ్‌లెస్ డ్రస్ వేసుకోవాల్సి వస్తే, చేయబోనని చెప్పాననీ, అయితే దర్శకుడు శేఖర్ కమ్ముల తనను కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించారనీ, అలా ఆ కష్టంగానే ఆ సన్నివేశం తాను చేయాల్సి వచ్చిందని సాయిపల్లవి అంటోంది.
‘ఇకపై కూడా గ్లామర్ విషయంలో నా ఆలోచనలు ఇలాగే వుంటాయి. నాకు గ్లామర్ సరిపడదు. నేను ఎక్స్‌పోజింగ్ చేయలేను. అలాగని ఎక్స్‌పోజింగ్ చేసే హీరోయిన్ల పట్ల నాకు వేరే ఆలోచన ఏమీ లేదు..’ అని సాయి పల్లవి స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తోన్న సాయిపల్లవి, కథ వినేటప్పుడే తాను అన్ని విషయాలపైనా క్లారిటీ తీసుకుంటాననీ, ఆ తర్వాత దర్శక నిర్మాతలకు పూర్తిగా సహకరించడం తన బాధ్యత అనీ, సినిమా అనుకున్న సమయానికి పూర్తవడంలో తన నుంచి పూర్తి సపోర్ట్ ఎప్పుడూ వుంటుందని సాయిపల్లవి అంటోంది. విమర్శలెప్పుడూ వస్తుంటాయ్.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చింది ఈ బ్యూటీ.