ఏమని చెప్పేది ఆమె గురించి, విడుదలకి ముందే ఫుల్ మార్కులేయించేసుకున్న ఆ బ్యూటీ, ఇక సినిమా విడుదలయ్యాక అందరి నోళ్లలోనూ ఉండకుండా ఎక్కడికి పోతుంది. అదేనండీ 'ఫిదా' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళ బ్యూటీ సాయి పల్లవి. ఈ రోజే 'ఫిదా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలే శేఖర్ కమ్ముల డైరెక్షన్. ఇంకెలా ఉంటుంది చెప్పండి. శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్స్‌కి ప్రత్యేకత ఉంటుంది. అంత అందంగా హీరోయిన్స్ క్యారెక్టర్‌ని డిజైన్ చేస్తూ ఉంటారాయన. అలాగే ఇప్పుడు సాయి పల్లవి వంతు వచ్చింది. అసలే సూపర్ యాక్టింగ్ టాలెంట్ ఉంది అమ్మడికి. తెలుగు అస్సలు రాకపోయినా, అచ్చమైన తెలుగమ్మాయిలా నటించేసింది. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పేసుకుంది తొలి సినిమాకే. అందులోనూ అచ్చమైన తెలంగాణా అమ్మాయిగా. ఇదేమీ చిన్న విషయం కాదు. సినిమాలో ఎక్కడా ఆమె నటనకి, డైలాగ్ డెలివరీకి వంకలు పెట్టడానికే లేదంటున్నారు. అంతగా టచ్ చేసేసింది ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియన్స్‌ని. ఆమె యాక్టింగ్ ముందు అందం చిన్నబోయింది. ఆ క్యారెక్టర్‌కి ఎందుకు సాయి పల్లవిని ఎంచుకున్నారో డైరెక్టర్ సినిమా చూస్తే అర్ధమయ్యింది. ఆమె నటనకి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా కాక తప్పదంటే నమ్మి తీరాల్సిందే. ఇక వరుణ్ సంగతంటారా? తొలి సినిమాతోనే ప్రూవ్ చేసేస్కున్నాడు వరుణ్. మరోసారి తనకి సూటబుల్ అనిపించే, ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీతో 'దటీజ్ మెగా ప్రిన్స్' అనిపించుకున్నాడు.