బిగ్‌ ట్విస్ట్‌: సాయి పల్లవి నక్సలైట్‌ కాదా.?

మరిన్ని వార్తలు

‘విరాటపర్వం’ సినిమా నుంచి హీరోయిన్‌ సాయి పల్లవి లుక్‌ ఇటీవల విడుదలైంది. రానా దగ్గుబాటి ఈ సినిమాలో నక్సలైట్‌ నాయకుడిగా కన్పించనున్నాడంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో సాయి పల్లవి లుక్‌ కూడా దాదాపు దానికి లింక్‌ వున్నట్లుగానే డిజైన్‌ చేసి విడుదల చేశారు. అయితే, తాజాగా విన్పిస్తున్న ఊహాగానాల ప్రకారం ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్‌ పాత్రలో నటించడంలేదట. కానీ, ఆమె ఓ సింగర్‌ అనీ, నక్సలిజం భావాలు వున్నప్పటికీ, ప్రజా గాయనిగా మాత్రమే ఆమె పాత్ర వుంటుందనీ మరో గాసిప్‌ తెరపైకొచ్చింది. వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే.

 

కాగా, ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర ఏంటి.? అన్నదానిపై ఇప్పటిదాకా చిత్ర దర్శక నిర్మాతలు స్పందించలేదు. ఆ పాత్ర మాత్రం, షాకింగ్‌ ట్విస్ట్‌లతో కూడుకుని వుంటుందట. రానా దగ్గుబాటితో సమానంగా సాయిపల్లవి పాత్రకు సినిమాలో ప్రాధాన్యత వుంటుందనీ, ఇద్దరూ పోటా పోటీ పాత్రల్లో కన్పిస్తారనీ అంటున్నారు. నటిగా సాయిపల్లవి ఎప్పుడో నూటికి నూరు మార్కులూ వేయించేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాతో నటిగా ఆమె మరో మెట్టు పైకెక్కుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. కాగా, సాయిపల్లవి ‘లవ్‌ స్టోరీ’ అనే సినిమాలోనూ నటిస్తోంది. నాగచైతన్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం విదితమే. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోంది ఈ ‘లవ్‌ స్టోరీ’.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS