కీర్తి సురేష్‌: ఛాన్సులు వదిలేసుకుంటాను గానీ..

మరిన్ని వార్తలు

‘గ్లామరస్‌గా కన్పించే హీరోయిన్లపై నేను విమర్శలు చేయలేను. అదే సమయంలో, తెరపై గ్లామర్‌ పేరుతో అనవసరంగా అంగాంగ ప్రదర్శన చేయడాన్ని ఇష్టపడను. నా వరకూ నేను గ్లామర్‌ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటాను. అందంగా కన్పించడం వరకూ ఓకే.. స్కిన్‌ షో మాత్రం నాట్‌ ఓకే..’ అని తేల్చి చెప్పేసింది కీర్తి సురేష్‌. కీర్తి సురేష్‌ బికినీలో కన్పించబోతోందనీ, అవకాశాల కోసం గ్లామర్‌ హద్దుల్ని చెరిపేసిందనీ ప్రచారం జరుగుతున్న వేళ, ఈ బ్యూటీ స్పష్టతనిచ్చింది. ‘కెరీర్‌లో ఇప్పుడు నేనున్న పొజిషన్‌ నాకు చాలా సంతృప్తికరం. ఇది నేను గ్లామర్‌ చూపించకుండానే సాధించింది.

 

ముందు ముందు కూడా ఇలాగే సినిమాలు చేసుకుంటూ వెళతాను’ అని తేల్చి చెప్పిన ఈ ‘మహానటి’, కొన్ని సినిమాల్ని గ్లామర్‌ కారణంగా వదులుకున్నట్లు తెలిపింది. ప్రసుత్తం ‘మిస్‌ ఇండియా’ సినిమాలో నటిస్తోన్న కీర్తి, ఇటీవల ఓ బాలీవుడ్‌ సినిమా ఛాన్స్‌ని మిస్‌ చేసుకున్న విషయం విదితమే. అయితే, అవకాశాలెప్పుడూ వస్తూనే వుంటాయనీ, తప్పిపోయినవాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదని కీర్తి సురేష్‌ అంటోంది. సినిమా సినిమాకీ నెంబర్లు మారిపోతుంటాయ్‌ గనుక, నటిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు మాత్రమే చేస్తానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది ఈ అందాల భామ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS